Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీ మేనిఫెస్టోలో మ‌ద్య‌పాన నిషేధం అన్న మాటే లేదు: ఏపీ మంత్రి అమ‌ర్‌నాథ్

ap minister gudivada amarnath comments on liquor ban in andhra pradesh
  • మ‌ద్యం ధ‌ర‌ల‌ను ఫైవ్ స్టార్ హోట‌ల్ రేట్ల‌కు తీసుకెళ్లామ‌న్న అమ‌ర్‌నాథ్‌
  • ఎవ‌రైనా మ‌ద్యం తాగాలంటే షాక్ కొట్టేలా చేస్తామ‌నే చెప్పామ‌ని వెల్ల‌డి
  • ఆ మేర‌కే మ‌ద్యం ధ‌ర‌ల‌పై చ‌ర్య‌ల‌ని వివ‌ర‌ణ‌
మ‌ద్య‌పాన నిషేధం అన్న మాటే త‌మ పార్టీ మేనిఫెస్టోలో లేద‌ని ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ శ‌నివారం స్పష్టం చేశారు. రాష్ట్రంలో మ‌ద్యం ధ‌ర‌ల‌ను క్ర‌మంగా పెంచుతున్న వైనంపైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో మ‌ద్యం ధ‌ర‌ల‌ను ఫైవ్ స్టార్ హోట‌ల్ రేట్ల‌కు తీసుకెళ‌తామ‌ని మాత్ర‌మే చెప్పామ‌ని అమ‌ర్‌నాథ్ వెల్ల‌డించారు. 

రాష్ట్రంలో తాము అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఎవరైనా మ‌ద్యం  తాగాలంటే వారికి షాక్ కొట్టేలా చేస్తామ‌నే చెప్పామ‌ని కూడా ఆయ‌న వివ‌రించారు. అందులో భాగంగానే మ‌ద్యం ధ‌ర‌ల‌పై తాము గ‌తంలో చెప్పిన‌ట్లు ఇప్పుడు చేస్తున్నామ‌ని మంత్రి వివరించారు. 
YSRCP
YS Jagan
Gudivada Amarnath
LIquor
Andhra Pradesh

More Telugu News